తిరుగు లేని గరుడ వేగ .. సూపర్ శాటిలైట్

ఓటమి .. వాయిదా వేయబడిన గెలుపు అనే మాటను వింటూ ఉంటాం .. అదే మాట ఇప్పుడు రాజశేఖర్ విషయంలో నిజమైంది. వరుస పరాజయాలను ఎదుర్కుంటూ వచ్చి డీలాపడిపోయిన రాజశేఖర్ కి, ‘గరుడ వేగ’ భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా తన సత్తా చాటుకుంటోంది. ఈనేపథ్యంలో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా భారీ రేటుకు పలికాయి.
విడుదలకి ముందే శాటిలైట్ రైట్స్ అమ్మేసి ఉంటే 2 కోట్ల లోపే వచ్చి ఉండేవని అంటున్నారు. సినిమా హిట్ అయిన తరువాత శాటిలైట్ రైట్స్ అమ్మకానికి సిద్ధపడటం కలిసొచ్చింది. జెమినీ టీవీ వారు ఈ సినిమా శాటిలైట్ హక్కులను 4 కోట్లకు కొనుగోలు చేసినట్టుగా సమాచారం. ఈ రోజు అగ్రిమెంట్ కి సంబంధించిన పనులను పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. జీవిత రాజశేఖర్ ఇదే బ్యానర్ పై మరో సినిమాను ప్లాన్ చేస్తున్నట్టుగా వినికిడి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here