ఏపీ లో ఇంటికే క్వారంటైన్ కిట్ ఇదిగో చూడండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే కరోనా నియంత్రణ విషయంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే బాగా ముందు ఉన్న సంగతి తెలిసిందే. రికార్డు స్థాయిలో టెస్టింగ్ జరుపుతున్న ఏపీ ప్రభుత్వం ఇప్పటికే జిల్లాకి నాలుగు బస్సులను కరోనా నిర్థారణ టెస్టింగ్ కోసం ఏర్పాటు చేసిన విషయం కూడా తెలిసిందే.

ఇప్పుడు మరో కీలక ముందడుగు వేసి కోవిడ్ హోమ్ క్వారంటైన్ కిట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందిస్తోంది. కరోనా పాజిటివ్ అని వచ్చి స్వల్ప లక్షణాలతో ఉన్నవారు హాస్పిటల్ కి వెళ్ళ లసిన అవసరం లేదు కనుక ఇంటిలోనే తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అలాంటివారికి సహకారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హోమ్ క్వారంటెన్ కిట్ ను ఇచ్చింది.

ఇక దీనిలో మనం కరోనా లక్షణాలను నయం చేసే టాబ్లెట్లు, చేతికి గ్లౌజులు, శానిటైజర్లు, మాస్కులు మరియు ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని అసెస్ చేసుకునేందుకు ఒక ఎలక్ట్రానిక్ పరికరాన్ని కూడా పొందుపరిచారు. నిజంగా ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here