బద్దకరత్న అవార్డు పవన్ కే

హీరో పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా బాక్సాఫీస్ దగ్గర భయంకరంగా బోల్తాపడింది ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అటు బయ్యర్లకు ఇటు అభిమానులకు తీవ్రమైన నిరాశ మిగిల్చింది.దీనికి కారణం హీరో పవన్ కళ్యాణ్ అని మొహమాటం లేకుండా చెప్పవచ్చు.కథ ఎంచుకోవడం నుండి విడుదలవడం వరకు పవన్ కళ్యాణ్ బద్ధకం కంటికి కనపడినట్లు స్పష్టంగా అర్థమవుతుంది.కేవలం సినిమా కథను ఫోన్ లో విన్నీ ఓకే చెప్పిన కళ్యాణ్ కథను ఎంచుకోవడంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడో అర్థమవుతుంది.

తాను చాలా సందర్భాలలో తనకు సినిమాలలో యాక్టింగ్ చేయడం అంత ఇష్టం లేదని తరచు చెబుతూ ఉంటాడు పవన్ కళ్యాణ్.ఈ విషయం అజ్ఞాతవాసి సినిమా చూసిన తర్వాత నిజమే అనిపిస్తుంది,అంతేకాకుండా సినిమాలో కనీసం డ్యాన్స్ కూడా సరిగా చేయలేక పోయాడు కనీసం పాటలో లిప్ ముమెంట్ ఇవ్వడానికి కూడా తెగ కష్టపడి నట్టున్నాడు. ఫైట్స్ పరంగా చూసినా పవన్ కళ్యాణ్ చేతులు తిప్పడం తప్ప కాలు కదపలేదు.మరోపక్క త్రివిక్రమ్ కూడా ఎదో  డబ్బులకోసం సినిమా తీసినట్టు ఈ సినిమాను తీయటం జరిగింది కనీసం త్రివిక్రమ్ పెన్ పవర్ సినిమాలో ఎక్కడా కనబడలేదు.ఇలా ప్రతి కోణంలో పవన్ కళ్యాణ్ తన బద్ధకాన్ని ప్రదర్శించాడు అని అనటంలో సందేహం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here