ట్రంప్‌ను పొగుడుతున్న ఆ దేశం ఏంటో తెలుసా..

డొనాల్డ్ ట్రంప్ తెలియ‌ని వారు ఈ ప్ర‌పంచంలో ఎవ్వ‌రూ ఉండ‌రు. ఎందుకంటే అమెరికా అధ్య‌క్షుడిగా ఆయ‌న అంద‌రికీ సుప‌రిచితుడే. అంత‌కంటే ఎక్కువ‌గా మొన్న జ‌రిగిన అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఆయన ఇంకా పాపుల‌ర్ అయ్యారు. అయితే ఈ ఎన్నిక‌ల్లో జో బైడెన్ చేతిలో ట్రంప్ ఓట‌మి పాల‌య్యారు.

అయితే ట్రంప్‌ను మాత్రం ఓ దేశ అధ్యక్షుడు పొగుడుతున్నారు. తాజాగా మెక్సికో అధ్యక్షుడు ఆండ్రే మాన్యుయల్ లోపెజ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం పరాజయం పొందిన ట్రంప్‌కు ఎంతో కొంత స్వాంతన కలిగించక మానవు. తమ దేశానికి కరోనా టీకా కేటాయించేలా చేయడంలో ట్రంప్ ఎంతో సహాయపడ్డారని, ఆయన వల్లే తమకు కరోనా టీకా కేటాయింపులు జరిగాయని అగ్రరాజ్య మాజీ అధ్యక్షుడిపై ఆయన ఇటీవల ప్రసంశల వర్షం కురిపించారు. మొత్తం 34.4 మిలియన్ టీకా డోసుల కోసం మెక్సికో ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది.

వీటిలో 2.5 లక్షల డోసులు డిసెంబర్‌లో మెక్సికోకు చేరుతాయట. అయితే..ఫైజర్ టీకాకు అమెరికా ప్రభుత్వానుమతులు వచ్చే వరకూ తామూ వేచి చూస్తామని మెక్సికో అధ్యక్షుడు తెలిపారు. పంపిణీ చేసేందుకు మిలటరీ సహాయం కూడా తీసుకుంటామన్నారు. ఇక ట్రంప్ కోరుకున్నట్టు ఎన్నికల మునుపే అగ్రరాజ్యంలో కరోనా టీకా విడుదలై ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఏమాటకామట చెప్పుకోవాలి.. కరోనా టీకాకు అనుమతులు ఇప్పించుకునేందుకు ట్రంప్ విశ్వప్రయత్నం చేశారు. చివరి వరకూ ప్రయత్నించినా అనుకున్నది మాత్రం సాధించలేక పోయారు. ఈలోపు.. సైన్స్ తన పని తాను చేసుకుపోయింది. అత్యవసర అనుమతులు ఇచ్చేందుకు అక్కడి అధికారులు అసలేమాత్రం తొందర పడలేదు. దీంతో ట్రంప్‌కు నిరాశే మిగిలింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here