” సింబు తండ్రి నన్ను తీవ్రంగా అవమానించాడు , వారం రోజుల పాటు “

కొంత కాలం క్రితం ఓ సినిమా ప్రమోషన్ కోసం ఏర్పాటు చేయబడిన మీడియా సమావేశంలో, సీనియర్ నటుడు టి. రాజేందర్ పాల్గొన్నారు. ఆ సినిమాలో నటించిన ధన్సిక ఆ వేదికపై మాట్లాడుతూ, ఆయన పేరును ప్రస్తావించలేదు. దాంతో ఆమె ధోరణి పట్ల ఆయన ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. “రజనీ సినిమాలో చేయగానే స్టార్ హీరోయిన్ అయిపోయావు .. నేనెలా కనిపిస్తానులే” అంటూ హేళనగా మాట్లాడారు. ఆమె కన్నీళ్లు పెట్టుకున్నా .. సారీ చెప్పినా ఆయన ఎంతమాత్రం తగ్గలేదు.
ఆ సంఘటనను గురించి తాజాగా ధన్సిక స్పందించింది. ఆ రోజున ఆయన చేసిన అవమానానికి తనకి వారం రోజులపాటు నిద్ర పట్టలేదనీ, ఆ సంఘటన తనని ఎంతో మనోవేదనకు గురిచేసిందని చెప్పింది. ఆయనకి ఆధ్యాత్మిక భావాలు ఎక్కువంటారు. కానీ అలాంటి లక్షణం ఒక్కటి కూడా తనకి కనిపించలేదని అంది. అలాంటి మనస్తత్వం వున్న వాళ్లెవరూ అలా మాట్లాడరనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆధ్యాత్మిక భావాలు తనలో ఎక్కువగా ఉండటం వలన మౌనంగా వుండిపోయానని చెప్పుకొచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here