క‌రోనా పుట్టింది అమెరికాలోనా.. ఏది నిజం..

ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎక్క‌డ పుట్టింద‌న్న దానిపై ఇప్ప‌టి వ‌ర‌కు స్ప‌ష్ట‌త రాలేదు. అయితే ప్ర‌పంచ దేశాలు మాత్రం క‌రోనా వైర‌స్ చైనా నుంచే వ్యాపించింద‌ని అంటున్నాయి. అయితే ఈ విష‌యాన్ని చైనా కొట్టి పారేస్తోంది. ఈ ప‌రిస్థితుల్లో ఓ కొత్త వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) ఇచ్చిన రిపోర్టు ఇందుకు బిన్నంగా ఉంది. సీడీసీ… కరోనాకు సంబంధించిన ఒక కొత్త విషయాన్ని వెల్లడించింది. కరోనా మహమ్మారి గత ఏడాది డిసెంబరులోనే అమెరికాలో వ్యాప్తిచెందిందని తెలిపింది. ఇంతకాలం అమెరికా… ఈ కరోనా వైరస్‌కు చైనానే కారణమని ఆరోపిస్తూవస్తోంది. అయితే సీడీసీ తెలిపిన ఈ వివరాలతో చైనా, అమెరికాల మధ్య మరో వివాదం చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సీడీసీ ఈ అధ్యయనం కోసం రెడ్‌క్రాస్ సాయంతో 7,389 బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి, పలు పరిశోధనలు నిర్వహించింది. ఈ శాంపిల్స్‌లోని 106 నమూనాలలో వైరస్ కనుగొన్నారు. చైనా శాస్త్రవేత్తలు చేస్తున్న వాదన ప్రకారం.. చైనాలో బయటపడ్డది అసలు కరోనా వైరస్ కాదట. వాస్తవానికి ఈ మహమ్మారి భారత్‌లోనే పురుడు పోసుకుందట. గత ఏడాది ఎండాకాలంలో ఈ వైరస్ ఆవిర్భవించిందని వారు వాదిస్తున్నారు. ఆ తరువాత..కలుషిత నీటి ద్వారా జంతువుల నుంచి మనుషులకు పాకిందని చెబుతున్నారు.

అంతేకాకుండా.. భారత్‌లోని అరకొర వైద్య వసతులు, అధికంగా ఉన్న యువ జనాభా కారణంగా ఈ వైరస్ గుట్టుచప్పుడు కాకుండా వ్యాపించిందని అంటున్నారు. ఇప్పటివరకూ గుర్తించిన వైరస్ స్ట్రెయిన్ల జన్యుక్రమం విశ్లేషణ ఆధారంగా ఈ అంచనాకు వచ్చామని వారు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here