కడప జిల్లాలో 7, 8 తేదీల్లో సీఎం జగన్‌ పర్యటన..

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ నెల 7, 8 తేదీల్లో వైఎస్సార్‌ జిల్లాలో పర్యటించనున్నారు. తన తండ్రి దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయకు వెళ్తున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్‌ను సీఎం అదనపు పీఎస్‌ కె.నాగేశ్వరరెడ్డి ఆదివారం విడుదల చేశారు. షెడ్యూల్‌ ఇలా..

7వ తేదీ మ.3.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి సీఎం బయల్దేరి గన్నవరం విమానాశ్రయం చేరుకుని.. అక్కడి నుంచి విమానంలో కడపకు బయల్దేరుతారు.

సాయంత్రం కడప విమానాశ్రయంలో దిగి.. హెలికాప్టర్‌లో ఇడుపులపాయకు చేరుకుంటారు. రాత్రికి ఇడుపులపాయ అతిథిగృహంలో బస చేస్తారు.

​​​​​8వ తేదీ ఉదయం ఇడుపులపాయలోని వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తారు.

​అనంతరం వైఎస్సార్‌ సర్కిల్, ఆర్‌.కె.వ్యాలీ వద్ద ఆర్‌జీయూకేటీకి చేరుకుని కొత్త భవన సముదాయానికి ప్రారంభోత్సవం.. 3 మెగావాట్ల సోలార్‌ ప్లాంటు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
​​​​​​​

ఆ తర్వాత ఇడుపులపాయ అతిథి గృహానికి వెళ్తారు. మధ్యాహ్నం కడప విమానాశ్రయానికి వెళ్లి అక్కడి∙నుంచి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here