క్రిస్మ‌స్ రోజు హీరో నాని స్పెష‌ల్ గిఫ్ట్..

తెలుగు సినీ ఇండస్ట్రీలో వ‌రుస హిట్‌లు అందుకుంటూ కెరీర్‌ను సాఫీగా కొన‌సాగిస్తున్న హీరో నాని.. నానికి ఇప్పుడు ఇండ‌స్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉంది. త‌న న‌ట‌న‌తో పాటు మంచి స్టోరీ ఉన్న సినిమాలు ఎంపిక‌చేసుకొని ఆయ‌న బాగా పాపుల‌ర్ అయ్యారు. నాని సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే స్థాయికి ఆయ‌న ఎదిగారు.

తాజాగా నాని న‌టిస్తున్న చిత్రం ట‌క్ జ‌గ‌దీష్‌. డైరెక్ట‌ర్ శివ నిర్వాణ ఈ సినిమా తీస్తున్నారు. నిన్ను కోరి, మ‌జిలీ వంటి సూప‌ర్ హిట్ స్టోరీలు శివ ఇప్ప‌టికే ప‌రిచ‌యం చేశాడు. ఇప్పుడు ట‌క్ జ‌గ‌దీష్‌తో మ‌రో కొత్త స్టోరీ ప‌రిచ‌యం చేయ‌బోతున్నాడు. క్రిస్మస్ సందర్భంగా తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. వడ్డించిన విస్తరి ముందు టక్ వేసుకుని కూర్చొని వెనుక నుంచి కత్తి తీస్తున్న నాని ఫొటోను ఫస్ట్‌లుక్‌గా విడుదల చేశారు. నాని పాత్రపై సస్పెన్స్‌ను పెంచే విధంగా ఫస్ట్ లుక్ ఉంది. అలాగే ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయబోతున్నట్టు పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. జగపతి బాబు కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here