నా ప్రాణానికి ప్రాణమైన అభిమానులందరికీ కృతజ్ఞతలు: ఎమోషనల్ ట్వీట్ చేసిన చిరు 

ఒక్క టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా చిరంజీవి అనే పేరు ఒక సంచలనం. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చిరు.. దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగిన చిరంజీవి టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థాయికి చేరుకున్నారు. ఇక చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఈరోజుతో (మంగళవారం) 42 ఏళ్లు నిండాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చిరు ట్విట్టర్ వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

‘నా జీవితంలో ఆగస్ట్‌ 22 కి ఎంత ప్రాముఖ్యత ఉందో, సెప్టెంబర్‌ 22 కి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఆగష్టు 22 నేను మనిషిగా ప్రాణం పోసుకున్న రోజైతే, సెప్టెంబర్‌ 22 నటుడిగా “ప్రాణం (ఖరీదు) “పోసుకొన్న రోజు. నా తొలి చిత్రం విడుదలైన రోజు. నన్ను ఇంతగా ఆదరించి ఈ స్థాయికి చేర్చిన సినీ ప్రేక్షక్షులందరికీ, ముఖ్యంగా నా ప్రాణానికి ప్రాణమైన నా అభిమానులందరికి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను’ అని చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here