ప్ర‌యోగ‌ద‌శ‌లో ఉన్న వ్యాక్సిన్ ఇస్తున్న చైనా.. ఏమైనా జ‌రిగితే

క‌రోనా వ్యాక్సిన్ వినియోగంలో చైనా చేస్తున్న తీరు ఇప్పుడు ఆందోళ‌న‌లోకి నెట్టేస్తోంది. క‌రోనా వ్యాక్సిన్‌కు క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ జ‌ర‌గ‌క‌ముందే లక్ష‌ల మందికి వ్యాక్సిన్ ఇవ్వ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అత్య‌వ‌స‌ర‌మైతేనే ఇవ్వాల్సిన వ్యాక్సిన్ ఇప్ప‌డు లక్ష‌ల్లో వినియోగం చేస్తున్నార‌న్న వార్త‌లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

చైనాలో అత్య‌వ‌స‌ర‌మైన వారికి మాత్ర‌మే వ్యాక్సిన్ ఇవ్వాల‌ని చైనా ప్ర‌భుత్వం జూన్‌లోనే చెప్పింది.
అయితే చైనాలో ఇంకా వ్యాక్సిన్ ప్ర‌యోగ‌ద‌శ‌లోనే ఉంది. దీంతో ప్ర‌భుత్వ ఆదేశాల‌తో ప‌లు సంస్థ‌లు వ్యాక్సిన్ ఇస్తుండ‌గా చాలా మంది దీన్ని తీసుకున్నారు. అయితే మొద‌టి ద‌శ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు లేక‌పోగా.. రెండో ద‌శ టీకా తీసుకున్న త‌ర్వాత కొన్ని మార్పులు క‌నిపించాయి. దీంతో వ్యాక్సిన్‌ను ఇవ్వడం మంచిది కాద‌ని ప‌లువురి నుంచి అభ్యంత‌రాలు వ్యక్త‌మ‌వ‌య్యాయి.

ఎందుకంటే ఇంకా ప్ర‌యోగ‌ద‌శ‌లోనే ఉంద‌ని.. మూడు ద‌శ‌ల క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ పూర్తి చేసుకున్న త‌ర్వాత దీన్ని అంద‌జేయాల‌ని ప‌లువురు కోరుతున్నారు. ఇప్ప‌టికే ఈ వ్యాక్సిన్‌ను కొన్ని లక్ష‌ల మంది తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. దీనిపై ప్రముఖ ర‌చ‌యిత స్పందిస్తూ రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత కారు న‌డుపుతుంటే క‌ళ్లు తిరిగిన‌ట్లు అనిపించింద‌ని అందుకే వెంట‌నే కారును ప‌క్క‌కు ఆపేసిన‌ట్లు చెప్పారు. ప్ర‌భుత్వం అత్య‌వ‌స‌ర వినియోగం కోసం టీకా ఇవ్వ‌మ‌ని చెబితే దీన్ని అత్య‌ధిక సంఖ్య‌లోనే వినియోగించార‌న్న పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే కేవ‌లం ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నిబంధ‌న‌ల ప్ర‌కారం అత్య‌వ‌స‌రం అయితేనే ఈ వ్యాక్సిన్ ఇస్తున్న‌ట్లు అక్క‌డి ప్రభుత్వ అధికారులు స‌మ‌ర్ధించుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here