ప్రభుత్వానికి చంద్రబాబు సవాల్ !!

వైసీపీ ప్ర‌భుత్వానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు స‌వాల్ విసిరారు. త‌న పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నార‌ని.. మీరు కూడా రాజీనామా చేసేందుకు సిద్ధ‌మా అన్నారు.

వైసీపీ ప్ర‌భుత్వ తీరుపై చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మూడు రాజ‌ధానుల ఏర్పాటు స‌రైంద‌నుకుంటే అంద‌రం రాజీనామాలు చేసి ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్దామ‌న్నారు. 48 గంట‌ల స‌మ‌య‌మిస్తున్నా అసెంబ్లీని ర‌ద్దు చేయండ‌న్నారు. ప్ర‌జ‌ల్లో తేల్చుకుందామ‌న్నారు.

రాజీనామాలు చేసేందుకు త‌మ పార్టీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నార‌న్న చంద్ర‌బాబు. మీరు కూడా రాజీనామాలు చేసి రావాల‌ని వైసీపీ ఎమ్మెల్యేల‌ను ఉద్దేశించి మాట్లాడారు. నా స‌వాల్ స్వీక‌రిస్తారా.. ప్ర‌జ‌ల‌కు వెన్నుపోటు పొడుస్తారా అని ఆయ‌న ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. రెండు రోజుల్లో స్పందించాల‌ని లేదంటేమ మళ్లీ మీడియా ముందుకు వ‌స్తాన‌న్నారు.

అయితే వైసీపీ నేత‌లు మాత్రం త‌మ ప్ర‌భుత్వం ప్ర‌జ‌లు ఎన్నుకున్న‌దని చెబుతున్నారు. త‌మ ప‌ని తీరుకు ప్ర‌జ‌ల స‌మాధానం 2024 ఎన్నిక‌ల్లో తెలుస్తుంద‌ని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here