బాబుతో మళ్లీ పవన్ భేటీ అట.. జనం నవ్వుకుంటున్నారు!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో.. టీడీపీ షాడో పార్టీగా జనం చెప్పుకుంటున్న జనసేన పార్టీ రాజకీయ వ్యూహాలు ఎవరికీ అంతుబట్టడం లేదు. ఓ వైపు రాజకీయాలు.. మరోవైపు.. చంద్రబాబును పల్లెత్తు మాట కూడా అనేందుకు నోరు రాని తీరు. ఈ రెండింటితో.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. ఏం సాధించదలుచుకున్నారో.. ఎలాంటి రాజకీయాలు చేయాలని అనుకుంటున్నారో.. అర్థం కాక.. రాజకీయాల్లో పవన్ ను తిట్టుకునేవాళ్లే కాక.. సినిమాల్లో అభిమానించేవాళ్లు కూడా జుట్టు పీక్కుంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో.. పవన్ మరోసారి చంద్రబాబుతో భేటీ కాబోతున్నారట. ఆ విషయాన్ని.. టీడీపీ అనుకూల పత్రికలు కూడా ప్రముఖంగానే ప్రచురిస్తున్నాయి. పైగా.. ఉత్ధానం ప్రాంతంలో కిడ్నీ బాధితుల సమస్యల మీద మాట్లాడతారట. అప్పుడెప్పుడో.. పవన్ ఉత్ధానం వెళ్లి అక్కడి కిడ్నీ బాధితులతో మాట్లాడితే.. ఇప్పటివరకూ ప్రభుత్వం పరంగా పట్టించుకున్న దిక్కే లేదు. ఇలాంటి స్థితిలో.. పవన్ డైరెక్ట్ గా రంగంలోకి దిగి ఫైట్ చేయాల్సింది పోయి.. మళ్లీ ముఖ్యమంత్రిని కలుస్తా.. లుంగీ కట్టుకుని మాట్లాడుతా.. అద్భుతంగా నటిస్తా అంటే వచ్చే లాభం ఏదీ లేదన్నది అర్థం చేసుకోవాలి.

ఈ విషయాలన్నీ గమనిస్తున్న జనాలు.. ఇప్పటికైనా పవన్ చంద్రబాబుకు డమ్మీగా మారకుండా.. యాక్టివ్ పాలిటిక్స్ లో ఎంటరైతే మంచి భవిష్యత్తు ఉంటుందని సూచిస్తున్నారు. అలాగే.. షూటింగ్ లు త్వరగా పూర్తి చేసుకుని.. డైరెక్ట్ పాలిటిక్స్ లో ఎంటరై.. ఊరూ వాడా తిరిగితే.. మాస్ హీరోను మించిన మాస్ పొలిటీషియన్ ఇమేజ్ వస్తుందని స్పష్టం చేస్తున్నారు. పవన్ కు ఆ కేపబులిటీ కూడా ఉందని అంటున్నారు. మరి.. పవన్ చేస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here