రజినీకాంత్ దెబ్బకి భయపడిన బన్నీ , మహేష్

కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ బాబు చేస్తోన్న ‘భరత్ అనే నేను’ సినిమాను ఏప్రిల్ 27వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో బన్నీ చేస్తోన్న ‘నా పేరు సూర్య’ సినిమాను కూడా అదే రోజున విడుదల చేయనున్నట్టుగా అంతకుముందే ఎనౌన్స్ చేశారు. దాంతో ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ వుండనుందనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది.
అయితే ప్రస్తుతం ఈ రెండు సినిమాలు కూడా విడుదల తేదీని మార్చుకోనున్నట్టు తెలుస్తోంది. అందుకు కారణం రజనీకాంత్ ‘2.0’ అని సమాచారం. జనవరి 25కి ఈ సినిమాను రిలీజ్ చేద్దామనుకుంటే కుదరకపోవడంతో, ఏప్రిల్ 14న విడుదల చేద్దామనుకున్నారు. ఆ తరువాత మనసు మార్చుకుని 27వ తేదీకి ఫిక్స్ చేసుకున్నారట. దాంతో అదే రోజున విడుదల కావలసిన మహేశ్ .. బన్నీ సినిమాలకి థియేటర్స్ దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 13న రావడానికే మహేశ్ రెడీ అవుతున్నాడని టాక్. ఇక బన్నీ ఏ డేట్ ను ఫిక్స్ చేసుకుంటాడో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here