‘బాయ్స్’ చిత్రం ఎలా ఎలా లిరికల్ సాంగ్.. విడుదల

శ్రీ పిక్చర్స్ బ్యానర్ పై గీతానంద్, మిత్ర శర్మ ప్రధాన పాత్రల్లో దయానంద్ తెరకెక్కిస్తున్న సినిమా బాయ్స్. ఈ మధ్యే సన్నీలియోన్ చేతులమీదుగా విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ఎలా ఎలా అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదల చేశారు.

సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సమా ఈ పాటను విడుదల చేశారు. యూత్ కు ఫుల్లుగా నచ్చేలా దీన్ని చిత్రీకరించారు దర్శకుడు దయానంద్. లేడీ ప్రొడ్యూసర్ మిత్ర శర్మ బాయ్స్ సినిమాను నిర్మిస్తున్నారు. ఒకవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు నిర్మాణ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు మిత్ర శర్మ.

వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు మార్తాండ్.కె.వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. బెక్కం రవీందర్, కొండపతురి ప్రసాద్ ప్రొడక్షన్ మేనేజర్లుగా పని చేస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here