ప్రపంచంలోనే అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్ 4’ గత ఆదివారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఈ షో రసవత్తరంగా మారుతోంది. తొలి నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇక ఇదిలా ఉంటే ప్రతిసారీ కొంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగుపెడతారనే విషయం తెలిసిందే. ఈసారి కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీకి రంగం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
అయితే తాజా సమాచారం ప్రకారం జబర్దస్త్ ఆర్టిస్ట్ అవినాష్, ‘ఈ రోజుల్లో’ ఫేమ్ కమెడియన్ శశి కుమార్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌజ్ లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. మరి ఈ ఇద్దరు హౌజ్ లోకి అడుగు పెట్టేది నిజమో కాదో చూడాలి.