బిగ్ బాస్ సీజన్-4 షార్ట్ అండ్ హాట్ గా

తెలుగు రాష్ట్రాలలో అత్యంత ప్రజాదరణతో దూసుకు పోతుంది బిగ్ బాస్ రియాలిటీ షో. ఇప్పటి వరకు జరిగిన మూడు సీజన్స్ సూపర్ సక్సెస్ కావడంతో మరింత క్రేజీగా బిగ్ బాస్ సీజన్ 4 నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. కరోనా కారణంగా ఈ సారి బిగ్ బాస్ ఉంటుందా.. లేదా అనుమానాలు వస్తున్న సమయంలో త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 4 అని ప్రోమో విడుదల చేసారు.ఈ ఏడాది కూడా బిగ్ బాస్ షో ఉంటుంది అని నిర్వాహకులు తెలియజేస్తున్నారు.

ఇక ఇప్పటికే సెలెబ్రిటీల వేటలో స్టార్ మా యాజమాన్యం ఉన్నారు. కొందరు బుల్లి తెర నటులతో పాటు వెండి తెర నటులను, ప్రముఖులను సంప్రదిస్తున్నారు. కాగా ఈ సారి షో పీరియడ్ తగ్గించ నున్నారట. 100 రోజుల నిడివి గల ఈ షో ని 70రోజులకు తగ్గించనున్నారని సమాచారం. ఎపిసోడ్స్ తక్కువైనా మసాలా కాన్సెప్ట్స్, గేమ్స్ తో మరింత ఎంటర్టైనింగ్ గా షో ప్లాన్ చేస్తున్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here