ప్రభాస్ సినిమా రేపే విడుదల .. మిస్ అవ్వకండి

మాస్ హీరోగా ప్రభాస్ క్రేజ్ ను అమాంతంగా పెంచేసిన మూవీగా ‘ఛత్రపతి’ని గురించి చెప్పుకోవాలి. దర్శకుడు రాజమౌళి కెరియర్లోనూ ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచింది. శ్రియ .. ఆర్తి అగర్వాల్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా 2005లో వచ్చిన సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
అలాంటి ఈ సినిమాను తాజాగా తమిళంలోకి అనువదించారు. ‘చంద్రమౌళి’ పేరుతో ఈ సినిమాను రేపు అక్కడ రిలీజ్ చేస్తున్నారు. ‘బాహుబలి’ .. ‘బాహుబలి 2’ సినిమాలతో ప్రభాస్ కి తమిళంలోను క్రేజ్ పెరిగిపోయింది. అక్కడ కూడా ఆయన అభిమానుల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలో తమిళ ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ‘చంద్రమౌళి’ .. అక్కడ ఏ స్థాయి వసూళ్లను సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here