అర్జున్ రెడ్డి తో చెయ్యాలని ఉంది .. – హీరోయిన్

తెలుగు తెరకి తన గ్లామర్ తో మరింత అందాన్ని తీసుకొచ్చిన కథానాయిక మెహ్రీన్. కుర్రకారు కలల రాణిగా మెహ్రీన్ క్రేజ్ ఒక రేంజ్ లో పెరిగిపోతోంది. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ .. ‘మహానుభావుడు’ .. ‘రాజా ది గ్రేట్’ .. ‘కేరాఫ్ సూర్య’ సినిమాలలో అలరించిన మెహ్రీన్, వచ్చేనెల 1వ తేదీన ‘జవాన్’తో ప్రేక్షకులను పలకరించనుంది. తాజాగా ఆమె ఐడ్రీమ్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది.
 “ఈ మధ్య కాలంలో మీరు చేసిన సినిమాలు కాకుండా మీకు బాగా నచ్చిన మరో సినిమా ఏమిటి?” అనే ప్రశ్న మెహ్రీన్ కి ఎదురైంది. అందుకామె స్పందిస్తూ .. ” వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వలన ఎక్కువ సినిమాలను చూడటానికి వీలుపడలేదు. నా సినిమాలు కాకుండా వేరే సినిమాలను కూడా నేను చూస్తుంటాను. అలా చూసినవాటిలో ‘అర్జున్ రెడ్డి’ బాగా నచ్చింది.
యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాను తెరకెక్కించిన తీరు నన్ను బాగా ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండతో చేయాలనుంది .. అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను” అని చెప్పుకొచ్చింది. మెహ్రీన్ జోరు చూస్తుంటే .. ఈ కాంబినేషన్ సెట్ కావడానికి పెద్దగా సమయం పట్టదనే విషయం అర్థమైపోవడం లేదూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here