ఏపీలో కరోనా పరిస్థితిపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లకు ఆయన దిశానిర్దేశం చేశారు. నిర్లక్ష్యంగా ఉండకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.
ఇక ఏపీలో ప్రతి రోజూ పదివేలకు పైగా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5 లక్షలు దాటిపోయింది. ప్రభుత్వం కూడా కరోనా టెస్టులను పెంచిన విషయం తెలిసిందే. మొదట్లోనే కరోనాను గుర్తించి చికిత్స అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఇప్పట్లో ప్రతి రోజూ ప్రభుత్వం 60వేల కరోనా పరీక్షలు చేస్తోంది.
ఈ పరిస్థితుల్లో వై.ఎస్ జగన్ కరోనా చర్యలపై సీరియస్‌గా ఉన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో కరోనా నిర్దారణ పరీక్షలు నిరంతరం నిర్వహించాలని జగన్ అధికారులతో అన్నారు. ట్రూనాట్, ఆర్.టి.పి.సి.ఆర్ పరీక్ష ఫలితాలను 24 గంటల్లో వెల్లడించాలన్నారు. కిట్లు లేవనే పేరుతో పరీక్షలు చేయకుండా ఉండకూదన్నారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కరోనా విషయంలో చేపడుతున్న అవగాహణ కార్యక్రమాలపై ఆయన ఆరా తీసినట్లు తెలుస్తోంది.






