త్వరలోనే ఇల్లాలు కాబోతున్న అనుష్క..?

సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ అనుష్క శెట్టి ఓ సంచలన నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఆమె గ్లామర్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతోందని, చేసిన సినిమాలు చాలు ఇకపై సినిమాల్లో నటించకూడదని డిసైడ్ అయిందని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. అంతేకాదు చాలా కాలంగా టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని పిలవబడుతున్న అనుష్క.. త్వరలోనే ఓ ఇంటిది కాబోతోందనే టాక్ ముదిరింది.

ముందుకొచ్చి.. గత 15 ఏళ్లుగా ఇండస్ట్రీని ఏలుతూ స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ కొట్టేసింది అనుష్క. ‘‘విక్రమార్కుడు, బిల్లా, వేదం’’ లాంటి ఎన్నో సినిమాల్లో అందాలతో అలరించిన ఆమె.. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ తనకు తిరుగులేదని నిరూపించుకుంది. ”అరుంధతి, రుద్రమదేవి, భాగమతి” సినిమాల్లో ఆమె చూపిన అభినయానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. దీంతో ఓ రేంజ్ పాపులారిటీ కూడగట్టుకొని అమితమైన ఫాలోయింగ్ కూడగట్టుకుంది అనుష్క.

ఈ క్రమంలో అనుష్క సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఆమె అభిమానులను నిరాశకుగురిచేస్తోంది. ‘ఇప్పుడున్న ఇమేజ్ చాలు.. ఇకపై సినిమాలు చేయనని అనుకుంటున్నా’ అని తన సన్నిహితుల వద్ద అనుష్క ప్రస్తావించినట్లు సమాచారం. మరోవైపు అతి త్వరలో అనుష్క పెళ్లి సెట్ చేసేయాలని ఆలోచనలో ఆమె కుటుంబ సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే అనుష్క.. వెండితెరకు దూరం కావాలనే నిర్ణయం తీసుకొని ఉంటుందనే కోణంలో చర్చలు ఊపందుకున్నాయి. దీంతో ఈ చర్చలపై అనుష్క ఎలా రియాక్ట్ అవుతుందనే దానిపై అందరి దృష్టి పడింది.

ఇకపోతే గతేడాది ‘సైరా’ సినిమాతో అలరించిన అనుష్క.. మరికొద్ది రోజుల్లోనే ‘నిశ్శబ్దం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మాధవన్, అనుష్క, షాలినీ పాండే ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు రెడీగా ఉంది. ఒకవేళ అనుష్క నిజంగానే వెండితెరకు గుడ్ బై చెప్పిందంటే ‘సూపర్’ అంటూ వచ్చి ‘బాహుబలి’గా అందలమెక్కి ‘నిశ్శబ్దం’గా వెళ్ళినట్లవుతుంది. చూద్దాం మరి.. ఇంతకీ అనుష్క ఏం చేస్తుందో!.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here