నిత్యానంద గురించి మ‌రో విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది..

నిత్యానంద ఈ పేరు తెలియ‌ని వారు ఇండియాలో ఎవ్వ‌రూ ఉండ‌ర‌ని చెప్పొచ్చు. ఎందుకంటే అప్ప‌ట్లో అత్యాచార కేసులో ఆయ‌న పేరు మార్మోగింది. దీంతో ఈయ‌న ఇండియా మొత్తం ఫేమ‌స్ అయిపోయారు. అయితే ఆ త‌ర్వాత ఆయ‌న దేశం వ‌దిలి ఓ ప్ర‌త్యేక స్థావ‌రం ఏర్పాటు చేసుకున్నార‌న్న వార్తలు ఎక్కువ‌గా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. స్వ‌యంగా ఆయ‌నే ఈ వివ‌రాలు వెల్ల‌డిస్తున్నార‌ని అంటున్నారు.

అత్యాచారం కేసులో నిందితుడైన నిత్యానంద దీవిలో ఏర్పాటు చేసిన కైలాస దేశానికి సందర్శకులకు వీసాల జారీ ప్రారంభించారు. ద్వీపదేశం కైలాస పేరిట ఓ ఈమెయిల్ ఐడీ కూడా సృష్టించారు. నిత్యానంద కైలాస దీవి ఆస్ట్రేలియాకు సమీపంలో ఉన్నట్లు భావిస్తున్నారు. ఆస్ట్రేలియా దేశం నుంచి కైలాస దీవికి గరుడ పేరిట ఛార్టర్ విమాన సర్వీసులను నిత్యానంద ప్రారంభించినట్లు వార్తలు వెలువడ్డాయి. కైలాస దీవిలో ఎవరికైనా వసతి కల్పిస్తారని, అయితే కేవలం మూడు రోజులకు మించి ఉండటానికి అనుమతించరని సమాచారం.

దీవిని సందర్శించేవారు పరమశివుని సందర్శించడానికి అనుమతిస్తారు. కైలాస డాట్ ఆర్గ్ పేరిట అధికారిక వెబ్ సైట్ సైతం ప్రారంభించారని సమాచారం.ఆగస్టు నెలలో నిత్యానంద రిజర్వుబ్యాంకు ప్రారంభించిన వీడియోను విడుదల చేశారు. కైలాస దీవిలో ఇంగ్లీషు, సంస్కృతం, తమిళభాషలను అధికారిక భాషలుగా గుర్తించినట్లు వార్తలు వెలువడ్డాయి. మ‌రి వీటిలో ఏది నిజ‌మో తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here