” నటన లో రవితేజ కి రవితేజ నే సాటి “

దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘రాజా ది గ్రేట్’ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హీరోను అంధుడిగా చూపించాలనుకోవడం ఒక సాహసమేనని చెప్పారు. కథలో కొత్తదనముండాలి .. హీరోను కొత్తగా చూపించాలనే ఆలోచనతోనే ఈ కథను సిద్ధం చేసుకున్నానని అన్నారు. మలయాళంలో మోహన్ లాల్ చేసిన ‘ఒప్పం’ సినిమా తనకి స్ఫూర్తి అని చెప్పారు.
 కథ కొంతవరకూ చెప్పినప్పుడు రవితేజ సందేహించారనీ, పూర్తిగా విన్న తరువాత చేయడానికి ఆసక్తిని చూపారని అన్నారు. పుట్టుకతో అంధుడైన ఓ కుర్రాడు ఎలా పెరిగాడు? .. ఆయనకి ఎదురైన పరిస్థితులు ఎలాంటివి? అప్పుడు ఆయన ఏం చేశాడు? అనే కథాంశంతో ఈ సినిమా కొనసాగుతుందని చెప్పారు. చూపులేని వ్యక్తిగా రవితేజ అదరగొట్టేశాడనీ, ఈ సినిమా చూసిన దిల్ రాజు తన పనితీరును పొగిడేశారని చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here