క‌రోనాతో అమితాబ‌చ్చ‌న్ బిగ్ ఫైట్‌..

ప‌రిచ‌యం అవ‌స‌రం లేని కుటుంబాల్లో అమితాబ‌చ్చ‌న్ కుటుంబం కూడా ఒక‌టి. అయితే గ‌త కొద్ది రోజులుగా వీరు కూడా క‌రోనా బారిన ప‌డి ఆస్ప‌తిలో చేరిన విష‌యం తెలిసిందే. అమితాబ్‌తో పాటు కొడుకు, కోడ‌లు, మ‌న‌వ‌రాలు కూడా ఆస్ప‌త్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు.

సాదార‌ణంగా సామాన్య వ్య‌క్తి నుంచి కోటీశ్వ‌రుల దాకా అంద‌రూ త‌మ ఆరోగ్య విష‌యంపై శ్ర‌ద్ధ పెట్ట‌డం ఇప్పుడు అల‌వాటైపోయింది. ఇక సెల‌బ్రటీల విష‌యానికొస్తే ఇది చాలా ఎక్కువే అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్ర‌తి రోజూ చేసే వ్యాయామాల ద‌గ్గ‌ర నుంచి తీసుకునే ఆహారం, ఆరోగ్యం పై జాగ్ర‌త్త‌ల వ‌ర‌కు అన్ని ప‌ర్‌ఫెక్ట్‌గా చేయ‌డంలో వారికి వారే సాట‌ని చెప్పొచ్చు. అయితే ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా విష‌యంలో మాత్రం కొంద‌రు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

ప్ర‌తి విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండే సెల‌బ్ర‌టీలు క‌‌రోనా బారిన ప‌డ‌టంతో అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇక అమితాబ్ కుటుంబం విష‌యానికొస్తే ఆయ‌న‌కు 77 ఏళ్లు, అభిషేక్ బ‌చ్చ‌న్‌కు 44, ఐశ్వ‌ర్యారాయ్‌కు 46, ఆరాధ్య‌కు 8 ఏళ్ల వ‌య‌స్సు. వీరంతా ఇప్పుడు ముంబైలోని నానావ‌తి హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. వీరి ఆరోగ్య ప‌రిస్థితిపై డాక్ట‌ర్లు ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం అందజేస్తున్నారు.

డాక్ట‌ర్ల రిపోర్టుల‌ను బ‌ట్టి చూస్తే ఇప్ప‌టివ‌ర‌కు వీరంతా కోవిడ్ నుంచి కోలుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. వైద్యం తీసుకుంటూ రోజురోజుకీ వీరు యాక్టీవ్‌గా ఉంటున్నారు. వీళ్లంతా ఐసోలేష‌న్ వార్డులో ఉన్నప్ప‌ట‌కీ ఆరోగ్యంగా ఉన్నారు. త్వ‌ర‌లోనే అమితాబ్, అభిషేక్ డిశ్చార్జ్ అవ్వ‌నున్నారు. ఆ త‌ర్వాత ఐశ్వ‌ర్య‌, ఆరాధ్య కూడా ఆస్ప‌త్రి నుంచి కోలుకొని ఇంటికి వెళ్ల‌నున్నారు. చివ‌ర‌గా క‌రోనా విజృంభిస్తున్నప్ప‌టికీ సాధార‌ణ రోజుల్లాగే ఆత్మ‌స్థైర్యంతో ఉంటూ ప‌రిమిత ప్ర‌దేశాల్లో త‌గు వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అస‌వ‌రం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here