ఆకాష్ కు అత్తగా రమ్యకృష్ణ..? 

దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ హీరోగా యంగ్ డైరెక్టర్ అనిల్ పాదూరి దర్శకత్వంలో ‘రొమాంటిక్’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆకాశ్ పూరి సరసన కేతికా శ‌ర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నటి రమ్యకృష్ణ కూడా నటిస్తోంది. ఈ సినిమాకు రమ్యకృష్ణ పాత్ర కీలకంగా ఉంటుందని..

గతంలో చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రమ్యకృష్ణ.. ఆకాష్ కు అత్త గా నటించనుందని తెలుస్తోంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పతాక సన్నివేశాలను పూర్తి చేసే పనిలో ఉంది చిత్రయూనిట్. ఈ సినిమాలో హిందీ నటుడు మకరంద్ దేశ్ పాండే కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతోనైనా ఆకాష్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో చూడాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here