జనసేనకు నిరుత్సాహం లేదు

ఈ సంక్రాంతికి విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  సినిమా  అజ్ఞాతవాసి తీవ్ర నిరాశ పరిచింది అటు  అభిమానులను ఇటు సిని ప్రేక్షకులను. అయితే ఈ ప్రభావం పవన్ రాజకీయాలపై ఉండదని జనసేన పార్టీ వర్గాలు అంటున్నాయి.సినిమాలు వేరు రాజకీయాలు వేరు అని చెబుతున్నారు.సినిమా అంటే హిట్లు ప్లాపులు ఉంటాయని అసలు జనసేన కార్యక్రమాలలో తమ అధ్యక్షుడు సినిమాలు ప్రస్తావన రాదాని పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడు  చెప్పారు.

ఈ క్రమంలో అజ్ఞాతవాసి సినిమా కొంత నిరుత్సాహపరిచిన మాట వాస్తవమే అని చెప్పారు.మరి అదే విధంగా ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ తమ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మిద మాటల దాడి వెనుక కొన్ని రాజకీయ శక్తులు ఉన్నాయని అంటున్నారు.తమ అధ్యక్షుడు మాత్రం అటువంటి ఆరోపణలు పట్టించుకోవద్దని నేను పట్టించుకోవట్లేదని రాజకీయాల్లో ఈ సర్వసాధారణమని అన్నారు.యువత పవన్‌ పట్ల చూపిస్తున్న ఆదరణ సాధారణమైంది కాదని అందుకే వ్యతిరేకులు భరించలేకపోతున్నారని వారంటున్నారు.

అంతేకాకుండా ఈసారి క్రియాశీల రాజకీయాలలో  జనసేన పార్టీ  ప్రజాసమస్యల పట్ల చురుకుగా ఉండి పరిష్కారం దిశగా రాజకీయాలు చేస్తుందని జనసేన పార్టీ వర్గాలు అంటున్నాయి. అంతేకాకుండా తమ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో రాజకీయాల్లో ఉంటారని పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here