పాన్ ఇండియా సినిమాలో ఆదిసాయికుమార్

సాయికుమార్ త‌న‌యుడిగా ఇండ్ర‌స్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆది. ప్రేమ కావాలి, లవ్లీ సినిమాల‌తో మంచి విజ‌యాలు ద‌క్కాయి. ఆ త‌ర‌వాతే ట్రాక్ త‌ప్పాడు. ప్ర‌తిభ ఉన్నా, అవ‌కాశాలు వ‌స్తున్నా స‌ద్వినియోగం చేసుకోవ‌డం లేదు. ఇప్పుడు స‌రైన క‌థ కోసం, స‌రైన ప్రాజెక్టు కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్ర‌మంలో ఓ ఛాన్స్ వ‌చ్చింది ఆది. ఈసారి ఏకంగా పాన్ ఇండియా ప్రాజెక్టుపైనే గురి పెట్టాడు.

బాల‌వీర్ అనే ఓ యువ ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ ఆదికి బాగా న‌చ్చింది. తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇదో ఇన్వెస్టిగేటీవ్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌. చిన్న కామిక్ ట‌చ్ కూడా ఉంటుంద‌ట‌. క్ష‌ణం, గూఢ‌చారి, బ్రోచేవారెవ‌రురా, ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ సినిమాలు చిన్న బ‌డ్జెట్‌లో తెర‌కెక్కినా, మంచి ఇంపాక్ట్ చూపించాయి. ఇదే కోవ‌లో ఈచిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. కాక‌పోతే పాన్ ఇండియా స్థాయిలో. ఈ ప్రాజెక్టుపై రెండేళ్ల నుంచీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ట‌. సౌత్ ఇండియాలోని కీల‌క న‌టులు ఈ సినిమాలో క‌నిపిస్తార‌ని స‌మాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here