పాకిస్తాన్ తన హద్దులు దాటుతూనే ఉంది. తాజాగా జమ్ముకశ్మీర్‌లో నియంత్రణ రేఖ వద్ద కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ముగ్గురు భారత సైనికులు చనిపోయారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయి.
భారత్, పాక్ లు 2003లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించాయి. దీని ద్వారా సరిహద్దులో ఎలాంట కాల్పులకు ఇరు దేశాలు పాల్పడకూడదు. అయితే పాకిస్థాన్ మాత్రం ఇది పాటించడం లేదు. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. నేడు జరిపిన కాల్పుల్లో వేర్వేరు చోట్ల ముగ్గురు భారత జవాన్లు అమరులయ్యారు. పాకిస్థాన్ కేవలం భారత స్థావరాలను లక్ష్యంగా చేసుకొని మోర్టార్లతో దాడులు చేసింది. అయితే భారత సైన్యం కూడా ఇదే రీతిలో పాక్‌కు గట్టి పోటీ ఇచ్చింది.
కాగా ప్రమాదవశాత్తు వీరు మృతి చెందారు. ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా నౌగామ్ సెక్టార్‌లో పాక్ ఆర్మీ మోర్టార్లతో కాల్పులు ప్రారంభించినట్టు రక్షణ శాఖ నుంచి సమాచారం అందింది. ఘటనలో ఇద్దరు భారత జవాన్లు అమరులు కాగా, నలుగురు గాయపడినట్టు పేర్కొన్నారు. అయితే పాక్ ఇలాంటి చర్యలకు పాల్పడటం ఇటీవల ఎక్కువవుతోంది. ఈ ఎనిమిది నెలల్లోనే 3 వేల సార్లకు పైగా పాక్ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇలా వ్యవహరిస్తోంది. అయితే పాక్ సైన్యానికి ఎలాంటి నష్టం జరిగిందో వివరాలు బయటకు రాలేదు. అయితే ఎప్పటిలాగే పాక్ ఇప్పుడు కూడా తమ దేశం ఎలాంటి ఒప్పందాన్ని ఉల్లంఘించలేదని చెప్పుకుంటోందని తెలుస్తోంది.