100 మంది ‘కామన్ మెన్’ సెలబ్రిటీలుగా విడుదల కానున్న ‘బాయ్స్’ చిత్ర ట్రైలర్..

శ్రీ పిక్చర్స్ బ్యానర్‌పై గీతానంద్, మిత్ర శర్మ ప్రధాన పాత్రల్లో దయానంద్ తెరకెక్కిస్తున్న సినిమా బాయ్స్. ఈ మధ్యే సన్నీలియోన్ చేతుల మీదుగా విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. దాంతో పాటు ఇప్పటి వరకు విడుదలైన పాటలకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విభిన్నమైన పద్దతిలో విడుదల చేయబోతున్నారు మేకర్స్. దీనికోసం కొత్త కాన్సెప్ట్ ప్లాన్ చేస్తున్నారు. కామన్ మ్యాన్‌ను సెలబ్రిటీస్‌గా మారుస్తూ.. ట్రైలర్ విడుదల చేయబోతున్నారు బాయ్స్ దర్శక నిర్మాతలు. దీనికోసం ఆంధ్ర, తెలంగాణ నుంచి 100 మంది కామన్ పీపుల్‌ను ఎంపిక చేసి.. వాళ్లకు రోజూ 10 వేలు, 5 వేలు, 3 వేలు చొప్పున క్యాష్ ప్రైజ్ ఇస్తున్నారు బాయ్స్ చిత్ర యూనిట్. కామన్ మ్యాన్‌ను సెలబ్రిటీగా మార్చేస్తున్న ఈ కాన్సెప్టుకు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుంది. ఏ సిటీకి వెళ్లినా కూడా బాయ్స్ చిత్ర యూనిట్‌కు బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్. కామన్ మ్యాన్‌ను ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు శ్రీకాకుళం, వైజాగ్, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి సిటీస్ ఇప్పటికే పూర్తయ్యాయి.

విజయవాడ నుంచి గ్రాండ్‌గా కామన్ మ్యాన్ ఎంపిక ప్రక్రియ మొదలు కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో 10 పెద్ద సిటీస్ చిత్రయూనిట్ తిరిగి ‘Common Man is Our Celebrity’ కాన్సెప్టును మరింత విస్తృతం చేయనున్నారు. మొత్తంగా 100 మంది కామన్ మెన్‌ను ఎంపిక చేసి.. వాళ్లతోనే ఓ భారీ వేదికపై బాయ్స్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయించబోతున్నారు దర్శక నిర్మాతలు. దర్శకుడు దయానంద్‌తో పాటు చిత్ర యూనిట్ తీసుకున్న ఈ నిర్ణయానికి మంచి స్పందన వస్తుంది. లేడీ ప్రొడ్యూసర్ మిత్ర శర్మ బాయ్స్ సినిమాను నిర్మిస్తున్నారు. ఒకవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు నిర్మాణ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు మిత్ర శర్మ. వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు మార్తాండ్.కె.వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. బెక్కం రవీందర్, కొండపతురి ప్రసాద్ ప్రొడక్షన్ మేనేజర్లుగా పని చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here