కేసీఆర్ ఆరోగ్యంపై పిటిషన్.. తెలంగాణహైకోర్టు ఆగ్రహం.

తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా కాలంగా కనిపించడం లేదని .. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియచేయాలంటూ… హైకోర్టులో తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుతో రాజకీయ జిమ్మిక్కులు చేయవద్దని హెచ్చరికలు జారీ చేసింది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై రకరకాల పుకార్లు వస్తున్నాయని, దీంతో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ప్రజలు ఆందోళ చెందుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని నవీన్ తన పిటిషన్‌లో హైకోర్టు కోరారు. అత్యవసరగా విచారించాలని కోరారు. అయితే పిటిషన్‌ను అత్యవసరం విచారించే ప్రశ్నే లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ముఖ్యమంత్రి కనిపించకపోతే.. హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవలి కాలంలో బయటకు రాకపోవడం… చర్చనీయాంశమవుతోంది. రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేయడానికి ఇదో మంచి అవకాశంగా దొరికింది. కొంత మంది ఆయనకు కరోనా వచ్చిందని ప్రచారం ప్రారంభించారు. మరికొంత మంది ఆయన ప్రైవేటు ఆస్పత్రిలో ఉన్నారని చెప్పడం ప్రారంభించారు. సోషల్ మీడియా కేంద్రంగా.. రకరకాలుగా పుకార్లు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న కూడా.. కేసీఆర్ ారోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు ఏం చెబుతుందోనన్న ఆసక్తి రాజకీయవర్గాల్లో ఏర్పడింది.

అయితే.. రెండు రోజుల నుంచి కేసీఆర్.. పేరుతోప్రకటనలు విడుదలవుతున్నాయి. ఆయన ఓ రైతులతో మాట్లాడారని.. ఆడియో టేప్ విడుదల అయింది. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లోనే ఉన్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మంత్రులు మాత్రం… కేసీఆర్ ఎక్కడ ఉంటే ఏమిటని ఎదురుదాడి చేస్తున్నారు. అయితే.. ఇలాంటి గ్యాప్ తెచ్చుకోవడం… కేసీఆర్‌కు అప్పుడప్పుడూ అలవాటే. ఒక్క సారిగా ఆయన తెర ముందుకు వచ్చి విమర్శలకు చెక్ పెడతారు. కాకపోతే.. ఈ మధ్య కాలంలో ప్రతిపక్ష నేతలకు.. కాస్త పని దొరుకుతుందని టీఆర్ఎస్ నేతలంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here