ఎల్లో మీడియాపై తీవ్రంగా స్పందించిన వైసీపీ ఎంపీ

టీడీపీ నుంచి ప్రజాప్రతినిధులు వెళ్లిపోతున్న తరుణంలో… వైసీపీలోనే అంతర్గత తిరుగుబాటు రాబోతోంది అన్న భావన కలిగించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇటీవల ఒక ఎంపీ చేస్తున్న హడావుడిని అడ్డుపెట్టుకుని మరింత మంది ఆ దారిలోనే ఉన్నారన్న ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొందరు వైసీపీ ఎంపీలు బీజేపీ వైపు చూస్తున్నారంటూ వాట్సాప్‌, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. ఈ పేర్లలో తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ పేరును కూడా చేర్చారు. ఈ ప్రచారం ఆధారంగా చేసుకుని కొందరు వెబ్‌సైట్లలోనూ ఆయన పేరు రాశారు.

దీనిపై తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ తీవ్రంగా స్పందించారు. ఒక పత్రిక కూడా తన పేరును ప్రచురించిందని… వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. 30ఏళ్లలో మీడియా ఇంతగా దిగిజారిపోయిన పరిస్థితులను తాను ఎన్నడూ చూడలేదన్నారు. కల్పిత కథనాలు రాస్తే చూస్తూ ఊరుకునే వ్యక్తిని తాను కాదని… పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు అన్ని రకాలుగా చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రాణం పోయే వరకు వైసీపీలోనే ఉంటానంటున్నారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన వారికి సంబంధించిన ఆధారాలను కూడా సేకరించానని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని దుర్గాప్రసాద్‌ చెప్పారు. చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియాతో నాటకాలు ఆడిస్తూ ప్రభుత్వాన్ని విమర్శల పాలు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here