ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్నిహైకోర్టు తాజాగా ప్రశంసించింది..

ఏడాది కాలంగా ఏపీలోని వైఎస్ జగన్ సర్కార్ నిర్ణయాలపై హైకోర్టులో ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మొట్టకాయలు పడుతూనే ఉన్నాయి. దీంతో వైసీపీ శ్రేణులంతా ఢీలా పడ్డారు. కానీ తాజాగా హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసించింది. ఎట్టకేలకు జగన్ సర్కార్ కు గొప్ప ఊరటనిచ్చింది.

 

ఎల్.జీ పాలిమర్స్ విషయంలో రాజకీయం చేయాలని చూసిన ప్రతిపక్షాలకు జగన్ చెక్ పెట్టారు. బాధితులను పరామర్శించి ఎల్.జీ పాలిమర్స్ కు నిషేధాజ్ఞలు విధించి.. బాధితులకు కోటి రూపాయలు పరిహారం అందించారు. చరిత్రలోనే ఇంత భారీ సాయం చేసిన సీఎంగా నిలిచారు. ప్రతిపక్షాలు సైతం ప్రశంసించేలా చేశారు. ఇప్పుడు జగన్ ను హైకోర్టు కూడా ప్రశంసించడం విశేషం. ఈ తీర్పుపై వైసీపీ వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతోంది.

విశాఖపట్నం ఎల్.జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ వ్యవహారంలో జగన్ సర్కార్ ఎంతో గొప్పగా వ్యవహరించిందని హైకోర్టు వేయినోళ్ల పొగిండింది. సీఎం జగన్ ఏకంగా మృతిచెందిన ప్రతీ ఒక్కరికి కోటి రూపాయల భారీ తక్షణ నష్ట పరిహారం అందించి గొప్ప పని చేశారని ప్రశంసించింది. ఇంత భారీ మొత్తాన్ని పరిహారం గా ఇచ్చిన ప్రభుత్వ మానవతా దృక్ఫథాన్ని దయార్థ హృదయాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని హైకోర్టు తాజాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here