సరికొత్తగా రాబోతున్నబిగ్ బాస్ సీజన్ 4 !!

తెలుగునాట మంచి క్రేజ్ తెచ్చుకున్న రియాలిటీ షో బిగ్ బాస్‌. తొలి మూడు సీజన్లు హిట్టే. మొదటి సీజన్ ఎన్టీఆర్, రెండో సీజన్ నాని, మూడో సీజన్కి కింగ్ నాగార్జున హోస్ట్ చేసారు. ఇక నాలుగో సీజన్ ఎవరు హోస్ట్ చేస్తారో అని అంతా ఎదురు చూస్తున్నారు. నాలుగో సెషన్‌కి కూడా నాగార్జుననే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇప్ప‌టికే సెల‌బ్రెటీల ఫైన‌ల్ లిస్టు త‌యారైంద‌ట‌. ఇది వ‌ర‌కు ఈ షోలో 16 నుంచి 18 కంటెస్టెంట్లు ఉండేవారు. ఇప్పుడు 12 మందితోనే ఈ షోని న‌డిపిస్తార‌ని స‌మాచారం. బిగ్ బాస్ 3 సీజ‌న్ 100 రోజుల వ‌ర‌కూ సుదీర్ఘంగా సాగింది. అయితే ఈసారి 50 రోజుల‌కే ప‌రిమితం చేస్తార‌ని స‌మాచారం. బిగ్ బాస్ గేమ్ షోలో టాస్క్‌ల విష‌యంలోనూ మార్పులు ఉండ‌బోతున్నాయ‌ని తెలుస్తోంది. ఇది వ‌ర‌కు స‌భ్యుల్ని రెండు గ్రూపులుగా విడ‌గొట్టి టాస్కులు ఇచ్చేవారు. ఇప్పుడు క‌రోనా టైమ్ క‌దా. సోష‌ల్ డిస్టెన్స్ పాటించ‌డం చాలా కీల‌కం. పాత బిగ్ బాస్ సెట్ కే కొన్ని మార్పులు చేసి సీజన్ 4 నిర్వహించబోతున్నారు.. సామాజిక దూరం పాటించేలా ప‌డ‌క సెట్ట‌ప్పులూ, ఒకొక్క‌రికీ ఒక్కో స్నానాల గ‌ది, వాషింగ్‌మిష‌న్ ఉండేలా మార్పులు చేశార‌ని తెలుస్తోంది. మొత్తానికి బిగ్ బాస్ 4 షో సరికొత్త‌గా ద‌ర్శ‌న‌మివ్వ‌డానికి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసుకొంది. ఇక టీం చేసే ఆఫిసిఅల్ అనౌన్స్మెంట్ రావడమే  తరువాయి !!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here