రోజా గన్ మెన్ కు పాజిటివ్! .. ఆందోళనలో అభిమానులు!

సమాజికైతే వారు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధు, ఐఏస్ లు, ఐపీఎస్ లు… కరోనాకి అలాంటిఫీల్గ్స్ ఏమీ ఉండవు.. కరోనా దగ్గర అసలు బేరాలే ఉండవు! కాబట్టి జనాల్లో ఎంతమందిని తాకినా స్పందించడంలేదనో ఏమిటో కానీ తాజాగా పెద్దలను తాకడం మొదలుపెట్టింది కరోనా వైరస్! ఇందులో తాజాగా వైకాపా నగరి ఎమ్మెల్యే రోజా స్టాఫ్ లో ఒకరికి కరోనా వచ్చిందని తెలుస్తుంది!

కరోనా సమయంలో ఇంటిలో దాక్కొని, ఆన్ లైన్ కే పరిమితవైన వారికి పర్లేదు కానీ… ప్రజలతో మమేకమై తిరిగే ప్రజాప్రతినిధుల విషయంలో కరోనా కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది! ఇప్పటికే సీఎం కేసీఆర్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది 30మందికి కరోనా సోకిందనే ప్రచారం సాగుతోన్న నేపథ్యంలో… తాజాగా ఏపీఐఐసీ చైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా.. గన్ మెన్ కూడా కరోనా బారినపడ్డాడంట. ఈ మెరకు ఆయనను తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

దీంతో రోజా అభిమానులు, వైకాపా కార్యకర్తలు ఆందొళన చెందుతున్నారు. ఇటీవల జరిగిన 108 వాహనాల ప్రారంభోత్సవంతో సహా పలు కార్యక్రమాల్లో మాస్కు లేకుండానే రోజా పాల్గొన్నారు! దీంతో ఆమె అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఈ విషయంపై స్పందించిన ఫైర్ బ్రాంద్… తన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కరోనా బారిన తన గన్ మెన్ 18 రోజులుగా విధులకు రావడం లేదని, సెలవులో ఉన్నాడని రోజా తెలిపారు. 18 రోజులుగా విధులకు రావడం లేదని ఆమె వివరించారు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here