మద్యం షాపు యజమాని ఆలోచనకు ధన్యవాదాలు చెప్పిన ఆనంద్ మహీంద్రా….

సోషల్ మీడియాలో నిత్యం సందడి చేసే ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఆనంద్ మహీంద్రా ఒకరు. ఆసక్తికర పోస్టులు పెట్టే ఆయనకు భారీ ఫ్యాన్ మొయిల్ ఉంది. ఆయన పోస్టు చేసే పోస్టులు ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియోనే పోస్టు చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భౌతిక దూరాన్ని పాటించటం తప్పనిసరైంది.

బీహార్ కు చెందిన ఒక మద్యం షాపు యజమాని చేస్తున్న కొత్త టెక్నిక్ తనను విపరీతంగా ఆకట్టుకుందని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.ఇందులో షాపు యజమాని ఐదు అడుగులు పొడువున పెద్ద గొట్టాన్ని ఏర్పాటు చేశారు. ఆ గొట్టంలోకి తాడు కట్టి ఒక సీసాను అమర్చారు. వాలుగా ఉండేలా సిద్ధం చేసిన ఆ పైపులోకి సీసా జారేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

అదే సమయంలో సీసాను వెనక్కి లాగేందుకు తాడును ఏర్పాటు చేశారు.ఎవరైనా వినియోగదారుడు వచ్చినంతనే.. సీసాను తాడు సాయంతో వదులుతారు. అందులో తనకు కావాల్సిన బాటిల్ డిటైల్స్.. డబ్బులు పెడితే.. తిరిగి చిల్లర చెల్లిస్తారు. అది పూర్తి అయిన వెంటనే.. వారు ఆర్డర్ చేసిన మద్యం బాటిల్స్ ను గొట్టం ద్వారా జారవిడుస్తారు.

ఈ టెక్నిక్ చూసిన ఆనంద్ మహీంద్రా.. ఈ ఐడియాను మరింత డెవలప్ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. దీనికిసంబంధించిన వీడియోను విడుదల చేశారు. ఆసక్తికరంగా ఉన్న ఈ వీడియో అందరిని ఆకర్షిస్తోంది. మీరూ.. ఓ లుక్కేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here