భల్లాలదేవుడుని ప్రేమలో పడేసింది ఈ అమ్మాయే…

ఈమధ్యే టాలీవుడ్  హీరోస్ నితిన్ మరియు నిఖిల్ పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అయ్యారు . కరోనా వల్ల లొక్దౌన్ ఇవ్వటంతో వీరి  పెళ్లిళ్లు పోస్టుపోన్ అయ్యాయి. అయితే తాజాగా వీరి జతన మన భల్లాలదేవుడు కూడా చేరిపోయాడు. ఇదేంటి అనుకుంటున్నారా ? టాలీవుడ్ ది మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ రానా దగ్గుబాటి కూడా త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నాడు. ఈ విషయాన్నీ రానా స్వయంగా తన ఇంస్టాగ్రామ్ పేజీ ద్వారా తెలియజేసాడు. తన ప్రేయసితో కలిసి ఉన్న ఫోటోను జత చేసి ‘ఆమె యస్ చెప్పింది’ అని పోస్ట్ పెట్టాడు.

ఆ అమ్మాయి పేరు మిహికా బజాజ్. ముంబై కు చెందిన మిహికా బజాజ్ డ్యూడ్రాప్ డిజైన్ స్టూడియోను నడుపుతున్నది. ప్రస్తుతం డ్యూడ్రాప్ డిజైన్ స్టూడియో ఏర్పాటు చేసి ఈవెంట్ అండ్ వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ చేస్తున్నదని తెలుస్తోంది.

డిసెంబర్ లో వీళ్ళిద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నారని సమాచారం. అయితే  ఇది రానా లేడీ ఫ్యాన్స్ కి మాత్రం హార్ట్ బ్రేకింగ్ న్యూసే!!

ప్రస్తుతం రానా సాయి పల్లవితో విరాటపర్వం అనే మూవీ లో నటిస్తున్నాడు. దీనిని వేణు ఉడుగుల తెరకెక్కిస్తుండగా  సురేష్  ప్రొడక్షన్స్ మరియు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినీమాస్ నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here