బాహుబలి 2 ని చూసి కుళ్ళిపోతున్నారు

దక్షిణాది సినిమా బాహుబలి 2 మీద కేవలం దక్షిణ భారత దేశం లో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సినిమా దెబ్బకి దేశం మొత్తం మనవైపే చూస్తోంది. కానీ బాలీవుడ్ మీడియా మాత్రం ఈ విషయం లో విషం కక్కుతోంది. బాహుబలి 2 కి నెగెటివ్ గా ప్రచారం చెయ్యడం లో అక్కడి మీడియా చాలా ఆసక్తిగా ఉంది. బాహుబలి తో పాటు రోబో 2 కి కూడా వంద కోట్ల పైగా శాటిలైట్ హక్కులు దక్కాయి.. అన్ని బాషలలో కలిపి ఈ డబ్బు అందింది .

దీంతో పీకే దంగల్ కి ఉన్న రికార్డులు బద్దలయినట్టు అయ్యింది. బాలీవుడ్ మీడియా మాత్రం ఈ విషయం ఒప్పుకోవడం లేదు. పీకే, దంగల్ సినిమా రికార్డులు బద్దలు అయినా ఆయన కొత్త సినిమా థుగ్స్ ఆఫ్ హిందూస్తాన్ సినిమా శాటిలైట్ నూట ముప్పై కోట్లకి అమ్మేసారు అనీ దీంతో రివర్స్ లో కహానీలు చెబుతోంది అక్కడి మీడియా. ఒక ఆంగ్ల నవల ఆధారంగా తెరకి ఎక్కుతున్న ఈ ఆమిర్ చిత్రం స్వాతంత్రానికి ముందర ఉన్న బంది పొట్ల మాఫియా, దోపిడీ దారుల గురించి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here