పోస్టాఫీస్‌లో డబ్బులు డిపాజిట్ చేయాలని యోచించే వాళ్ళకి ఇది మంచి ఆఫర్..?

పోస్టాఫీస్‌లో డబ్బులు డిపాజిట్ చేయాలని యోచిస్తున్నారా? అయితే మీకు ఒక మంచి ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రతి నెలా డబ్బులు పొందే ఛాన్స్ పొందొచ్చు. అయితే దీని కోసం ఒకేసారి డబ్బులు డిపాజిట్ చేయాలి.

చేతిలోని డబ్బుతోనే అదిరిపోయే రాబడి పొందాలని భావిస్తున్నారా? అది కూడా రిస్క్ లేకుండానే కళ్లుచెదిరే లాభం పొందాలని చూస్తున్నారా? అయితే మీకు ఒక సూపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. పోస్టాఫీస్ పలు రకాల స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌ను అందిస్తున్నాయి. వీటిల్లో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కూడా ఒకటి.పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో డబ్బులు డిపాజిట్ చేసుకోవడం వల్ల రిస్క్ లేకుండానే మంచి రాబడి పొందొచ్చు. ప్రతి నెలా చేతికి డబ్బులు వస్తాయి. అయితే దీని కోసం మీరు ముందుగానే కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ పేరుపై పథకంలో చేరొచ్చు.

పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో గరిష్టంగా రూ.9 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు భార్యాభర్తలు అయితే జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయొచ్చు. స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. అయితే మళ్లీ మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు.

భారతీయ పౌరులు ఎవరైనా ఈ పథకంలో చేరొచ్చు. మీ డబ్బుకు 6.6 శాతం వడ్డీ లభిస్తుంది. మీరు మీ రూ.9 లక్షలు డిపాజిట్ చేస్తే ఏడాదికి రూ.59,400 పొందొచ్చు. అంటే నెలకు దాదాపు రూ.5,000 లభిస్తాయి. అదే మీరు సింగిల్ అకౌంట్ ద్వారా రూ.4.5 లక్షలు డిపాజిట్ చేస్తే.. మీకు నెలకు రూ.2,500 వరకు లభిస్తాయి. పోస్టాఫీస్‌కు వెళ్లి ఈ పథకంలో చేరొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here