నరసాపురం నియోజకవర్గంలో మరింత వేడెక్కుతున్న రాజుల రాజకీయాలు..

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు .. ఏపీ మంత్రి శ్రీరంగనాథ రాజు మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ కాస్తా ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని పోడూరు పోలీస్ స్టేషన్‌లో మంత్రి ఫిర్యాద చేశారు. తనపై అసత్య ఆరోపణలు చేసి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారని మంత్రి ఫిర్యాదులో పేర్కొన్నారు.

రాజకీయ, ప్రజా జీవితంలో విమర్శలు సహజం. కానీ ఒక అవకాశవాది తన వ్యక్తిగత, స్వార్థ, రాజకీయ ప్రయోజనాల కోసం ఎదుటి వారి వ్యక్తిత్వంపై దాడి చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదలుచుకోలేదన్నారు. తనను తన కుమారుని వ్యక్తిగతంగా దూషించి.. ‘దొంగలు’ అని సంబోధించడంపై మనస్తాపం చెందామన్నారు. తాను తన తోటి ఎమ్మెల్యేలు, మరో మంత్రి పేర్ని నానితో కలిసి ప్రెస్ మీట్‌లో మాట్లాడిన దానిని ఉదహరిస్తూ.. “పందులే గుంపులుగా వస్తాయి” అని ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించటంపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు.

ఇన్ని సంవత్సరాలు నిజాయితీ పరుడిగా, సేవా భావం కలిగిన వ్యక్తిగా, వివాదరహితుడిగా సమాజంలో నేను సంపాదించుకున్న మంచి పేరుపై బురద చల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిగా.. చట్టాలను గౌరవించే వ్యక్తిగా.. రాజ్యాంగం ప్రసాదించిన హక్కుతో.. న్యాయం కోసం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here