తెలంగాణ సచివాలయం కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు..?

తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోమవారం నాడు హైకోర్టు ఈ మేరకు సంచలన తీర్పును ఇచ్చింది.ప్రభుత్వ వాదనతో తెలంగాణ హైకోర్టు ఏకీభవించింది. సచివాలయం కూల్చివేయవద్దని దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది.

సచివాలయ భవనాన్ని కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు సహా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డితో పాటు మరో 10 పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై హైకోర్టు సుధీర్ఘంగా విచారణ జరిపింది. అన్ని వర్గాల వాదనలను హైకోర్టు వింది. ఈ ఏడాది మార్చి 10వ తేదీన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సోమవారం నాడు హైకోర్టు ఈ మేరకు సంచలన తీర్పును ఇచ్చింది. హైకోర్టు తీర్పుతో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించినట్లైంది.

సచివాలయంలో ఉన్న భవనాలను కూల్చి వేయొద్దని దాదాపు 10 పిటిషన్లు దాఖలయ్యాయి. అన్ని పిటిషన్లనూ హైకోర్టు కొట్టివేయడంతో… ప్రభుత్వం కొత్త సచివాలయం నిర్మించేందుకు మార్గం సుగమమైంది. ప్రభుత్వ పాలసీ విధానాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదన్న ప్రభుత్వ వాదనే నెగ్గింది. ఇక దీనిపై పోరాటం చేయాలనుకుంటే… కాంగ్రెస్ నేతలకు సుప్రీంకోర్టుకు వెళ్లడమే మిగిలివుంటుంది. ఐతే… ప్రస్తుతం కరోనా కాలం నడుస్తోంది కాబట్టి… అత్యంత ముఖ్యమైన అంశాలు, కేసులపైనే కోర్టులు ఫోకస్ పెడుతున్నాయి. అటు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికిప్పుడు సచివాలయ నిర్మాణం చేపట్టే అవకాశాలు కూడా కనిపించట్లేదు. కరోనా సమస్యే అన్నిటికంటే పెద్ద సమస్యగా ఉంది. దీన్ని వదిలించుకున్న తర్వాత ఇలాంటి అంశాలపై ఫోకస్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here