ఖైదీ నెంబ‌ర్ 2707.…!

ఇది క‌డ‌ప సెంట్ర‌ల్ జైల్లో జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డికి జైలు సిబ్బంది కేటాయించిన ఖైదు నెంబ‌ర్‌. వాహ‌నాల అక్ర‌మ రిజిస్ట్రేష‌న్ వ్య‌వ‌హారంలో   టీడీపీ నాయ‌కుడు, తాడిప‌త్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఆయ‌న కుమారుడు అస్మిత్‌రెడ్డిల‌ను  పోలీసులు అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందేమొద‌ట వీరిద్ద‌రిని అనంత‌పురం జిల్లా రెడ్డిప‌ల్లె కారాగారానికి పోలీసులు తీసుకెళ్లారు. అయితే అక్క‌డ క‌రోనా కేసు న‌మోదు కావ‌డంతో అనంత‌పురం వ‌న్‌టౌన్ పోలీస్‌స్టేష‌న్‌కు పోలీసులు తీసుకెళ్లారు.

తాడిప‌త్రి జైలుకు తీసుకెళ్లాల‌ని జ‌డ్జి ఆదేశించారు. అయితే అక్క‌డ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి స్వ‌స్థ‌లం కావ‌డంతో శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని జ‌డ్జి దృష్టికి పోలీసులు తీసుకెళ్లారు. దీంతో క‌డ‌ప సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించాల‌ని జ‌డ్జి ఆదేశించారు.

మేర‌కు తండ్రీకొడుకుల‌ను అనంత‌పురం నుంచి ఆదివారం తెల్ల‌వారుజామున నాలుగు గంట‌ల‌కు క‌డ‌ప సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించారు. రిమాండ్ ఖైదీలుగా జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి 2707, ఆయ‌న త‌న‌యుడు అస్మిత్‌రెడ్డికి 2708 నెంబ‌ర్ల‌ను కేటాయించారు. ఇద‌న్న మాట ఖైదీ నెంబ‌ర్ల క‌థ‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here