ఏపీ సీఎంవోలో కీలక మార్పులు..

ఏపీ సీఎంవోలో కీలక మార్పులు. సీఎంవోలో కీలకంగా ఉన్న అజేయ్ కల్లాం, పీవీ రమేష్‌లను తప్పించడం ఆసక్తికరంగా మారింది. అజేయ్ మొదటి నుంచి సీఎం ముఖ్యసలహాదారుగా వ్యవహరిస్తున్నారు.

ఏపీ సీఎంవోలో కీలక మార్పులు జరిగాయి. సీఎం కార్యాలయంలోని అధికారులకు శాఖల్లో మార్పులు జరిగాయి. సీఎం కార్యాలయం బాధ్యతలు నుంచి అజేయ్ కల్లాం, పీవీ రమేష్, జే. మురళిని సీఎం జగన్ తప్పించారు. ఆ ముగ్గురి బాధ్యతల్ని ప్రవీణ్ ప్రకాష్, సాల్మాన్ ఆరోఖ్య రాజ్, ధనుంజయ్ రెడ్డిలకు బదలాయించారు. ప్రవీణ్ ప్రకాష్ పరిధిలో జీఏడీ, హోం, రెవెన్యూ, ఫైనాన్స్, న్యాయ శాఖ, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, సీఎం డ్యాష్ బోర్డ్ ఉంటాయి. సాల్మన్ ఆరోఖ్య రాజ్ పరిధిలో రవాణా, ఆర్ అండ్ బీ, ఆర్టీసీ, గృహ నిర్మాణం, పౌర సరఫరాలు, పీఆర్, సంక్షేమం, విద్యా, పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ, గనులు, కార్మిక శాఖ. ధనుంజయ్ రెడ్డి పరిధిలో.. జలవనరులు, అటవీ, మున్సిపల్, వ్యవసాయం, వైద్యారోగ్యం, ఇంధనం, టూరిజం, మార్కెటింగ్, ఆర్ధిక శాఖలు ఉన్నాయి.

అజేయ్ మొదటి నుంచి సీఎం ముఖ్యసలహాదారుగా వ్యవహరిస్తున్నారు. సీఎంవోలో అత్యంత కీలకమైన హోం, రెవెన్యూ, ఫైనాన్స్ వంటి కీలక విభాగాల బాధ్యతలు పర్యవేక్షించేవారు. ఇప్పుడు ఆయన పరిధిలో ఉన్న సబ్జెక్ట్ లు అన్నీ తప్పించేశారు. పీవీ రమేష్‌కు తొలుత కీలక శాఖలు అప్పగించినా మధ్యలో కోత వేసి వైద్యం, విద్య వంటి శాఖలకు పరిమితం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here