ఏపీ లో కరోనా స్వైర విహారం..! ఈ సారి ఓ జిల్లాలో భీభత్సం

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు మార్చి రోజు రికార్డు స్థాయి కేసులు నమోదవుతున్నాయి. ఇక గడచిన 24 గంటల్లో 1,608 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ లో వెల్లడించింది. గత 24 గంటల్లో 21,020 మందికి పరీక్షలు నిర్వహించగా 1576 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 32మందికి వైరస్ సోకింది.. దీంతో మొత్తం కేసులు 1608కు చేరాయి.

గడచిన 24 గంటల్లో క‌రోనాతో మ‌రో 15 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 292కి చేరింది. గత 24 గంటల్లో 981మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 11,936 యాక్టివ్ కేసులుగా ఉన్నాయి. కాగా రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో నిర్వ‌హిస్తున్న క‌రోనా వైద్య పరీక్ష‌లు 11ల‌క్ష‌ల మార్కు‌ను దాటాయి.. ఇప్ప‌టివ‌ర‌కు 11,15,635 మందికి క‌రోనా వైద్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. రాష్ట్రంలో ప్ర‌తి మిలియ‌న్‌కు 20,892 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు

గత 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 208 కేసులు నమోదు కాగా, అనంతపురం జిల్లాలో 191 కేసులు, తూర్పగోదావరి జిల్లాలో 169, కర్నూలు జిల్లాలో 144, పశ్చిమగోదావరి జిల్లాలో 144, గుంటూరు జిల్లాలో 136, ప్రకాశం జిల్లాలో 110, కడప జిల్లాలో 91, విశాఖపట్నం జిల్లాలో 86, విజయనగరం జిల్లాలో 86, శ్రీకాకుళం జిల్లాలో 80, కృష్ణా జిల్లాలో 80, నెల్లూరు జిల్లాలో 51 రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో మొత్తం 2939 పాజిటివ్ కేసులు.. తర్వాత అనంతపురం జిల్లాలో కేసులు 2850కు చేరాయి. గుంటూరు జిల్లాలో 2799 కేసులు నమోదయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here