ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్..!

నందమూరి నట వారసత్వం పుచ్చుకున్న కళ్యాణ్ రామ్.. నటుడిగా, నిర్మాతగా తెలుగు చిత్రసీమలో తనదైన మార్క్ వేసుకున్నారు. 1989లో ‘బాలగోపాలుడు’ సినిమాలో బాలనటుడిగా నటించి సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన.. ఆ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని 2003లో ‘తొలిచూపులోనే’ సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చారు.

ఆ వెంటనే అదే ఏడాది ‘అభిమన్యు’ సినిమా చేసి తన టాలెంట్ బయటపెట్టారు. ఆ తర్వాత చేసిన ”అతనొక్కడే, లక్ష్మి కళ్యాణం, పటాస్” సినిమాలు ఆయన కెరీర్‌ని మలుపుతిప్పాయి. హీరోగా చేస్తూనే నిర్మాతగా రాణించాలనే తపనతో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి సక్సెస్ అయ్యారు కళ్యాణ్ రామ్. ఈ బ్యానర్ లోనే ఎన్టీఆర్ ‘జై లవకుశ’ సినిమా రూపొందించి భారీ హిట్ సాధించారు. సో.. కళ్యాణ్ రామ్ ఇంకా మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటూ ఈ నందమూరి వారసుడికి ‘తెలుగు సీఎం‘ తరఫున స్పెషల్‌గా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం.

ఇక ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎమోషనల్ గా తన అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెట్టారు. కళ్యాణ్  రామ్ తనకు అన్నకంటే ఎక్కువని అన్నారు. “నాకు అన్నయ్యగా మాత్రమే కాదు. అంత కంటే ఎక్కవ. నాకు స్నేహితుడు, మార్గదర్శి, తత్వవేత్త కూడా.నువ్వు నిజంగా అందరికన్నా బెస్ట్. హ్యాపీ బర్త్ డే కల్యాణ్ అన్నా” అని ట్వీట్ చేశారు.

హీరోగా చేస్తూనే నిర్మాతగా రాణించాలనే తపనతో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి సక్సెస్ అయ్యారు కళ్యాణ్ రామ్. ఈ బ్యానర్ లోనే ఎన్టీఆర్ ‘జై లవకుశ’ సినిమా రూపొందించి భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న చిత్రంలోనూ భాగమయ్యాడు. ప్రస్తుతం మల్లిడి వేణు దర్శకత్వంలో ఓ చిత్రంలో కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్నాడు. అతని పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here