అన్నిజాగ్రత్తలతో “అల్లుడు అదుర్స్”

రోజురోజుకు హైదరాబాద్ లో కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. హీరోలంతా తమ సినిమాల్ని పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు.

అయితే బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మాత్రం రిస్క్ చేశాడు. తన కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. వీలైనంత త్వరగా ఫస్ట్ కాపీ రెడీ చేయాలనే టార్గెట్ తోనే షూటింగ్ స్టార్ట్ చేసినట్టు చెబుతున్నారు. అన్నిజాగ్రత్తలతో “అల్లుడు అదుర్స్” షూటింగ్ ను కొనసాగిస్తున్నారు. మరో 10 రోజుల్లో టోటల్ షూట్ కంప్లీట్ అయిపోతుందని చెబుతున్నారు. అంతా బాగానే ఉంది కానీ, ఇప్పటికిప్పుడు ఫస్ట్ కాపీ రెడీ చేయడానికి బెల్లంకొండకు ఎందుకు ఇంత ఆరాటమో అర్థంకావడం లేదు. కనుచూపుమేరలో థియేటర్లు కూడా తెరిచే పరిస్థితి కనిపించడం లేదు.

 

కందిరీగ శ్రీనివాస్ దర్శకత్వంలో “అల్లుడు అదుర్స్” అనే సినిమా చేస్తున్నాడు బెల్లంకొండ. ఈ సినిమా షూటింగ్ దాదాపు 90శాతం పూర్తయింది. మరికొన్ని రోజుల షూట్, ప్యాచ్ వర్క్ మాత్రమే పెండింగ్. అది పూర్తయితే ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుంది.

 

అందుకే ఆ మిగిలిన 10శాతం షూటింగ్ కోసం సెట్స్ పైకొచ్చాడు బెల్లంకొండ. నభా నటేష్, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై జి.సుబ్రమణ్యం నిర్మిస్తున్నాడు. దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here