అందరి ముందరా అతని చెంప పగలగొట్టిన హోం మంత్రి ..

తెలంగాణా కి ఆయన హోం మంత్రి .. ఒక రాష్ట్రానికి అంటే దాదాపు ఐదుకోట్ల మందికి హోం మంత్రి అయిన వ్యక్తి హుందాతనం ఎంత గొప్పగా ఉండాలి ? కానీ కోపం లో ఆయన ఒక కార్యకర్త చంప చెళ్ళు మానిపించారు. అక్కడితో వ్యవహారం ఆగలేదు, నీ సంగతి చూస్తా అంటూ హెచ్చరించారు ఆయన. నువ్వు ఎక్కడెక్కడ పైసలు వసూలు చేస్తున్నావో తెలుసు అంటూ ఆగ్రహం తో అతని మీద ఊగిపోయారు నాయని. హైదరాబాద్ లోని గోష్ మహల్ లో జరిగిన తెరాస సభ్యత్వ నమోదు సందర్భంగా ఒక సభలో ఈ గందరగోళం జరిగింది.

సభలో మొదట మాట్లాడిన హోం మంత్రి నందకిషోర్ అనే కార్యకర్త కి మైకు ఇచ్చారు. వెంటనే మహేంద్ర అనే కార్యకర్త ఒక్క ఉదటున లేచి అభ్యంతరం చెప్పాడు. నందకిషోర్ కి అంత సీన్ ఇవ్వాల్సినవసరం లేదు అంటూ సీరియస్ అయ్యాడు .. ” ఉద్యమకారులని పక్కన పెట్టి బయటవారిని నెత్తికి ఎక్కించుకుంటున్నారు .. ఇది మంచి పద్ధతి కాదు ” అంటూ అందరి ముందరె హోం మంత్రి మీద విరుచుకు పడ్డాడు. దాంతో కోపంతో ఊగిపోయిన మంత్రి అంతమంది ముందు అవమానం పాలు అయ్యి అతని చెంప పగలగొట్టారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here