రైతుల‌ కోసం కేంద్ర ప్ర‌భుత్వం కొత్త ప్ర‌ణాళికా..

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాలు రైతుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్నయి. ఈ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ రైతులు దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఆందోళ‌న‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే.ఈ నిర‌స‌న‌ల‌కు దేశ వ్యాప్తంగా రైతుల‌కు మ‌ద్త‌తు పెరుగుతోంది. దీంతో కేంద్ర ప్ర‌భుత్వం రైతుల కోసం ఓ కొత్త ప్ర‌ణాళిక తీసుకొచ్చేందుకు రెడీ అవుతుంద‌ని స‌మాచారం.

వ్యవసాయ చట్టాలకు సవరణలు చేయడానికి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. రైతు సంఘాల ‘‘సహేతుకమైన’’ డిమాండ్లను పరిగణనలోకి తీసుకొని… వాటిని సవరించాలని, అందుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లు ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉభయ సభల్లోనూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సవరణలు ఆమోదించబడతాయని ప్రభుత్వం ధీమాతో ఉంది. అంతేకాకుండా ఇలా చేయడం ద్వారా రైతుల నిరసనలు తగ్గడంతో పాటు, ప్రతిపక్షాల కుట్రలు కూడా పంటాపంచలైపోతాయని ప్రభుత్వ ఆలోచనగా ఉన్నట్లు సమాచారం. అయితే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలపై ప్రభుత్వ వర్గాల నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి స్పందనా రాలేదు.

రైతుల సహేతుకమైన డిమాండ్లను ఒప్పుకుంటూ సవరణలు తేవాలన్నది కేంద్రం యోచనగా చెబుతున్నారు. ప్రధాన 4 సవరణలను ప్రతిపాదిస్తున్నారు. 1. ఎంఎస్పీ వ్యవస్థను కట్టుది ట్టం చేసి, అది కొనసాగేట్లు మార్పులు. కనీసం 22 ముఖ్యమైన పంటలకు ఎంఎస్పీ కచ్చితంగా అమలయ్యేట్లు చూడా లి. 2. ఏపీఎంసీల వద్ద సేకరణ పకడ్బందీగా కొనసాగేట్లు కొత్త నిబంధనలు తేవాలి. మూడు సాగు చట్టాల్లో అత్యంత కీలకమైన ఫా ర్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌ చట్టం ప్రకా రం రాష్ట్రాల అదుపులోని వ్యవసాయ మార్కెటింగ్‌ను కేంద్ర చట్టం పక్కన పడేస్తోంది. దీనిపైనే రైతుల అభ్యంతరం. దీనిలో సవరణలకు ప్రభుత్వం సుముఖంగా ఉంది. 3. కొత్త ప్రైవేటు వ్యాపారులు తప్పనిసరిగా రిజిస్టర్‌ చేసుకుని ఉండాలన్న నిబంధన 4. వివాదాల పరిష్కారాన్ని సబ్‌ డివిజినల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు నుంచి సివిల్‌ కోర్టులకు అప్పగించడం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here