మెగాస్టార్ చిరంజీవి నట వారసత్వమున్నా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. మగధీర సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసిన చెర్రీ ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. ఇక రామ్ చరణ్ కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా మారి తండ్రి చిరంజీవితో కొన్ని సినిమాలు తీసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే చెర్రీ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా కనిపించనున్నాడు. అయితే ఈ క్రమంలో తాజాగా రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ఓ ఫోటో ఆయన అభిమానులను ఆకట్టుకుంటోంది. అల్లూరి గెటప్ లో ఉన్న మీసపు కట్టు.. తీక్షణమైన కంటి చూపు ఫొటో ఆసక్తిగా ఉంది. ఇక ఈ ఫోటో తో పాటు “నీలోని బెస్ట్ వెర్షన్ గానే ఎప్పుడు ఉండాలి” అనే క్యాప్షన్ ను జోడించాడు చెర్రీ. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.
Be the best possible version of yourself!!💪 pic.twitter.com/fNpgeCmTLw
— Ram Charan (@AlwaysRamCharan) September 23, 2020