ఈ మధ్య కరెంటు బిల్లులు ఎక్కువ రావడం మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల ఓ రైతుకు రూ. 50 వేలు కరెంటు బిల్లు వస్తే రాష్ట్రంలో చర్చనీయాంశం అయ్యింది. అయితే వెంటనే విద్యుత్ శాఖ అధికారులు కలుగజేసుకొని ఆ బిల్లును సరిచేసి రైతుకు పంపారు.
అయితే ఆ బిల్లు పక్కన పెడితే దిమ్మ తిరిగేలా ఓ రైతుకు రూ. 3 కోట్లుపైగా కరెంట్ బిల్లు వచ్చింది. ఇది తెలుగు రాష్ట్రాలలో కాదు.. రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెమరం పటేల్ అనే ఓ వ్యక్తికి రెండు నెలలకు గాను 3 కోట్ల 71 లక్షల కరెంటు బిల్లు వచ్చింది. అయితే ఈయన ఏ దో పెద్ద పెద్ద కంపెనీలు నిర్వహించడం లేదు. మామూలుగా జీవనోపాధారమైన చిన్న దుకాణం నిర్వహిస్తున్నాడు.
విద్యుత్ అధికారులు ఇచ్చిన ఈ బిల్లుతో ఆయన ఒక్కసారిగా ఖంగుతిన్నారు. వెంటనే ఈ మిత్రా కేంద్రానికి వెళ్లి అధికారులతో మాట్లాడారు. అయితే ఈ బిల్లును చూసిన వారు కూడా షాక్‌కు గురయ్యారు. ఎందుకిలా వచ్చిందని క్షేత్ర స్థాయిలో పరిశీలించగా మీటరు రీడింగు నమోదు చేసే సమయంలో పొరపాటు జరిగినట్లు గుర్తించారు. మీటరు రీడింగు రికార్డు చేసే ఆపరేటర్ వద్ద పొరపాటు జరిగిందని చెప్పి.. వాస్తవమైన బిల్లు రూ. 6,414 బిల్లు ఇచ్చి పంపారు.