‘సరిలేరు నీకెవ్వరూ’ లాంటి సూపర్ హిట్ తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. డిసెంబర్ వరకు షూటింగ్ లో పాల్గొననని మహేష్ నిర్మాతలకు తేల్చిచెప్పాడు. అయితే తాజాగా మహేష్ షూటింగ్ పాల్గొన్న సమయంలో తీసిన ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
డైరెక్టర్ సీన్ వివరిస్తుండగా.. మహేష్ శ్రద్దగా వింటున్నాడు. షూటింగ్ లో పాల్గొనని చెప్పిన మహేష్ ఏ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడన్నదేగా మీ సందేహం. అయితే ఇది సినిమా కోసం చేస్తోన్న చిత్రీకరణ కాదు.. ఒక ప్రకటన కోసం చేసింది. ఈ యాడ్ చిత్రీకరణ రెండు మూడు రోజుల్లో ఇది పూర్తి కానుంది. దీనికి కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే వచ్చాడు సూపర్ స్టార్. అక్కడ సిబ్బంది అంతా పిపిఈ కిట్స్ ధరించారు. దాంతో పాటు ఆ షూటింగ్ ప్రాంతం అంతా శానిటైజ్ చేశారు. అలా అన్ని జాగ్రత్తలతోనే మహేష్ షూటింగ్‌లో అడుగు పెట్టాడు.