అందం, అభినయం కలగలిపిన అతికొద్ది మంది హీరోయిన్లలో నటి శృతిహాసన్ ఒకరు. తండ్రి కమలహాసన్ నట వారసత్వం ఉన్నా.. తన టాలెంట్ తో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుందీ అమ్మడు. తమిళంతో పాటు తెలుగు, హిందీ చిత్రాల్లో నటించి నేషనల్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్న శృతిహాసన్ ప్రస్తుతం బాలీవుడ్ లో పెద్దగా నటించట్లేదు… దీంతో ఆమెకు హిందీలో అవకాశాలు రావట్లేవని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్త శృతి చెవిలో పడడంతో ఈ అమ్మడు స్పందిస్తూ… ‘ నేను దక్షిణాది నుంచే వచ్చాను. తెలుగు, తమిళ చిత్రాలతోపాటు హిందీలోనూ నటించాను. శృతి దక్షిణాదికి పరిమితమైందని.. హిందీపై తనకు ఆసక్తి లేదని కొందరు అంటున్నట్లు నాకు తెలిసింది. కానీ నేను అన్ని భాషల నటిని… ప్రస్తుతం హిందీలో నటించక పోయినంత మాత్రాన నాకు అవకాశాలు లేవని కాదు. హిందీ సినిమాలను వదిలేసినట్టూ కాదు. జీవితంలో నేను తీసుకున్న నిర్ణయాలన్నీ నాకు నేనుగా తీసుకున్నవే. నాకు ఏదైనా ఎక్కువ కావాలనిపిస్తుంది. నాకు దురాశ ఎక్కువ’ అని చెప్పుకొచ్చింది శృతి.